స్కూల్‌పై నుంచి దూకిన బాలిక.. వెలుగులోకి సంచలన విషయాలు

4చూసినవారు
రాజస్థాన్ జైపూర్‌లో ఇటీవల 9 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ  ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్లాసులో ఓ అబ్బాయికి 'హలో' చెప్పినందుకు మిగతా పిల్లలు లవ్ ప్రపోజ్ చేశావని ఆమెను పదేపదే ఏడ్పించడంతో విసిగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి తల్లికి ఫోన్ చేసి స్కూల్ నుంచి తీసుకెళ్లాలని ఏడ్చిన ఆడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్