యూపీలోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బస్సులో ఇద్దరు యువతుల మధ్య చిన్న వివాదం కారణంగా ఘర్షణ జరిగింది. ఇద్దరూ బస్సులోనే ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ.. జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మొత్తం ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.