
ఆపరేషన్ సిందూర్‌లో పట్టుబడిన పాకిస్తానీ డ్రోన్ "YIHA" మొదటి దృశ్యాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం కూల్చివేసిన పాకిస్తానీ డ్రోన్ 'YIHA' యొక్క తొలి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మే 10న లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 10 కిలోల పేలుడు పదార్థాలతో ప్రయోగించిన ఈ డ్రోన్‌ను అమృత్సర్ సమీపంలో కూల్చివేశారు. ఇది టర్కీ, పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'కామికేజ్' రకానికి చెందినది. మే 8 నుండి పాకిస్తాన్ వందలాది సాయుధ డ్రోన్లతో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లోని 36 పట్టణాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.




