ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతుండటంతో.. బరువు, మధుమేహ నియంత్రణకు వాడే GLP-1 మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పేటెంట్లు ముగియడంతో జనరిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. ఆన్లైన్ మార్కెట్ వల్ల నాణ్యత లేని, నకిలీ మందుల ముప్పు ఉన్నందున నియంత్రణ సంస్థలు, వైద్యులు కలిసికట్టుగా వ్యవహరించాలని హెచ్చరికలు వెలువడ్డాయి. నాణ్యత, సరసమైన ధరలను కొనసాగిస్తే ఈ రంగంలో ప్రపంచ లీడర్‌గా ఎదిగేందుకు భారత్‌కు కీలక అవకాశం ఉంది.