TG: హైదరాబాద్ 'క్యూర్' పరిధిలో అఫర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. LIG, MIG ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దిగువ, మధ్యతరగతి కోసం లక్ష ఫ్లాట్లు నిర్మించనున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 12వేల ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతి ఇచ్చింది. ఎల్‌ఐజీ ఫ్లాట్లకు ప్రభుత్వం భూమి UDS, రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ, ప్రభుత్వ భూముల్లో ఫ్లాట్లు నిర్మాణం చేయనున్నారు.