హైదరాబాద్‌లో అందుబాటు ధరల్లో ఫ్లాట్ల నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వి.పి.గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల కోసం లక్ష ఫ్లాట్లు నిర్మించనుండగా, పైలట్ ప్రాజెక్టుగా 12 వేల ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతి లభించింది. ఎల్‌ఐజీ ఫ్లాట్లకు భూమి యూడీఎస్, రూ.5 లక్షల సబ్సిడీ అందించనున్నారు. హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ, ప్రభుత్వ భూముల్లో ఈ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు.