
యువతి హత్య కేసు.. తల్లిదండ్రులతో గుడికి వెళ్లిందని!(వీడియో)
TG: హైదరాబాద్లోని ముషీరాబాద్ పరిధిలో పవిత్ర అనే యువతి హత్య ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి మేనత్త షాకింగ్ నిజాలు వెల్లడించింది. 'పవిత్రకు ఉమాశంకర్ అంటే ప్రాణం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అనుమానంతో పవిత్రను ఉమాశంకర్ ఎక్కడకీ వెళ్లనిచ్చేవాడు కాదు. పవిత్ర తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లగా, అంతకుముందు ఉమాశంకర్ వద్దని చెప్పాడు. అయినప్పటికీ ఆమె గుడికి వెళ్లింది. దీంతో కోపంతో గొడవకు వచ్చి.. కత్తితో హత్య చేశాడు' అని తెలిపింది.




