భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

5178చూసినవారు
భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. గురువారం ఉదయానికి నీటిమట్టం 16.50 అడుగులకు చేరగా, 1,18,419 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. సాయంత్రానికి మరో 5 అడుగులు పెరిగే అవకాశం ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి 10,604 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్