
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
దేశవ్యాప్తంగా ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. గోవా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బెంగాల్, జార్ఖండ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.




