హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు తాజాగా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.2,680 దిగివచ్చి రూ.1,54,090 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.2,450 పతనమై రూ.1,41,250కు చేరింది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.10వేలు దిగి వచ్చి ప్రస్తుతం రూ.2.50,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి రేట్లలో స్వల్ప తేడాలు ఉండొచ్చు.