పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అలాగే బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,33,910 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి 5. 1,22,750కి చేరింది.