బంగారం, వెండి ధరలు బుధవారం అత్యంత భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,850 తగ్గి రూ.1,50,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,110 తగ్గి రూ.1,64,510 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గడంతో రూ.2,95,000 వద్ధ ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.