హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి రూ.1,40,460 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర ఇవాళ ఒక్కరోజే రూ.7వేలు పెరిగి రూ.2,75,000గాచేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.