బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,250 పెరిగి రూ.1,15,750కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,460 పెరిగి రూ.1,26,280 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.1,000 పెరగడంతో రూ.1,70,000 వద్ద ధర కొనసాగుతోంది. వారం రోజుల్లో కేజీ వెండిపై రూ.7,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.