అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఔన్సుకు 4 వేల డాలర్లు, దేశీయంగా రూ.1.30 లక్షలు దాటిన బంగారం ధర, ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం నాటికి ఔన్స్ ధర 10 వేల డాలర్లు (భారత్‌లో రూ.3 లక్షలు) దాటవచ్చని అంచనా వేస్తున్నారు.