బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.850 తగ్గి రూ.1,04,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.930 తగ్గి రూ.1,14,440 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.