దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల పసిడి ధర రూ. 2,700 పెరిగి రూ. 1,23,300 మార్కును అధిగమించింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,300 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. వెండి ధర కిలో రూ. 7,400 పెరిగి, రూ. 1,57,400 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధర ఏకంగా 75.47 శాతం పెరిగింది.