ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోయల్‌కు చెందిన ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రిలోని బెడ్‌పై ఉన్న ఒక మహిళ మృతదేహం నుంచి ఆసుపత్రి సిబ్బందే నగలను దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి. మృతదేహంపై ఉన్న నగలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆసుపత్రి సిబ్బందిపై విచారణ ప్రారంభించారు.