బంగారం చోరీ కేసు.. శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్టు

65చూసినవారు
బంగారం చోరీ కేసు.. శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్టు
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన పూజారి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను 11వ నిందితుడిగా నమోదు చేశారు. ఆలయ ద్వారపాలకుల విగ్రహాలు, శ్రీకోవిల్ ద్వారానికి ఉన్న బంగారు తొడుగులకు మళ్లీ బంగారు తాపడం చేయాలని సలహా ఇచ్చింది రాజీవరేనని విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ను ఆలయానికి తీసుకువచ్చింది కూడా రాజీవరేనని, వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్