
ఓటర్ల జాబితా ప్రక్రియలో వీవీఐపీలకు ఈసీ నోటీసులు
ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, వివరాలు సరిపోలకపోవడంతో కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సహా పలువురు వీవీఐపీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఓట్ల తొలగింపునకు ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆప్ ఆరోపించగా, ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని బీజేపీ స్పష్టం చేసింది. నోటీసులు పొందినవారు తగిన ఆధారాలు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.




