బక్కపలచగా ఉన్నవారికి బంగారు నీరు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన బంగారాన్ని నీటిలో వేసి కాచి, చల్లార్చిన నీటిని తాగితే ఏనుగు వంటి బలం వస్తుందని, ఇది శరీరాన్ని బలోపేతం చేసి, మనస్సును ప్రశాంతపరుస్తుందని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. గర్భిణీలు వైద్యుల సలహాతో తాగితే పిండం, మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుందని, గర్భాశయాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం. అయితే, రోజువారీగా తీసుకోవడం అవసరం లేదని, వారానికి 2-3 సార్లు సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.