TG: హైదరాబాద్ నుంచి కర్నూలు, తిరుపతిలకు తిరిగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులలో ప్రయాణించే వారికి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గుడ్‌న్యూస్ చెప్పారు. టికెట్‌పై 15 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో రూ. 450 చార్జీని రూ. 390గా, రూ. 390 చార్జీ ఉన్న డీలక్స్‌కు రూ.350గా, అలాగే హైదరాబాద్ నుండి తిరుపతి సూపర్ లగ్జరీకి ఇప్పుడున్న రూ.1090, రాయితీతో రూ.950 తగ్గించినట్లు తెలిపారు.