దసరా, దీపావళి పండగల వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందనుంది. కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (కరువు భత్యం)ను 3 శాతం పెంచే ప్రతిపాదనను పరిశీలించనుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే, జులై 1 నుంచి సవరించిన డీఏ అమల్లోకి వస్తుంది. దీనివల్ల దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు జాతీయ మీడియా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువరించింది.