ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక సింగిల్‌ యాప్‌లోనే KYC

26చూసినవారు
ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక సింగిల్‌ యాప్‌లోనే KYC
ఆధార్‌ వినియోగదారులకు UIDAI కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆధార్‌ ఫేస్‌ ఆథెంటికేషన్‌ SDK, శాండ్‌బాక్స్‌ టూల్స్‌ను విడుదల చేసింది. వీటితో బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఇతర ఆర్థిక సేవల యాప్‌లలోనే ముఖ ధ్రువీకరణ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటిలా ప్రత్యేకంగా Aadhaar Face RD వంటి మరో యాప్‌ను తెరవాల్సిన అవసరం ఉండదు. దీంతో KYC ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. SDKలో AI, మెషిన్‌ లెర్నింగ్‌ ఆధారిత లైవ్‌నెస్‌ ఫీచర్లు ఉండటంతో నకిలీ ఫొటోలు, వీడియోల ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు ఉపయోగపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్