ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత

48చూసినవారు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో ఛార్జీల పెంపు నిలిపివేత
బెంగళూర్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ఛార్జీల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన ఛార్జీల సవరణపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటివరకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఛార్జీలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రోజూ మెట్రోపై ఆధారపడే ప్రయాణికులు ఊరట పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్