మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారత్‌లోకి ‘లయన్ బ్రూవరీ’ రీ-ఎంట్రీ

23చూసినవారు
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారత్‌లోకి ‘లయన్ బ్రూవరీ’ రీ-ఎంట్రీ
దాదాపు 60 ఏళ్ల విరామం తర్వాత ప్రముఖ బ్రిటీష్ బీర్ తయారీ సంస్థ ‘లయన్ బ్రూవరీ’ కో భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ప్రిమియం బీర్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఐలాండ్ లాగర్, పేల్ ఏల్ పేర్లతో రెండు రకాల బీర్లను విడుదల చేసింది. దేశీయ పంపిణీ కోసం కాపర్‌డ్రాప్ స్పిరిట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ, త్వరలో హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు విస్తరించనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రిమియం, క్రాఫ్ట్ బీర్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకే తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్