TG: గ్రామీణ ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీజీరామ్‌జీ)’ను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త విధానంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచగా, రోజువారీ వేతనాలను కూడా సవరించింది. తెలంగాణలో కూలీల వేతనం రూ.307 నుంచి రూ.308కు, ఏపీలో రూ.307 నుంచి రూ.312కు పెరిగింది. ఈ పథకం అమలుకు తెలంగాణకు రూ.3,825.31 కోట్లు కేటాయించగా, రాష్ట్ర కేబినెట్‌లో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.