
ఆకాశాన్ని అంటుతున్న కోడిగుడ్డు, చికెన్ ధరలు!
దేశంలో కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం, పెట్రోల్ ఇథనాల్ బ్లెండింగ్ కోసం మొక్కజొన్నల వాడకం పెరగడం దీనికి ప్రధాన కారణాలు. గతంలో రూ.12-14 ఉన్న మొక్కజొన్న ధర ఇప్పుడు రూ.27-32కి చేరడంతో పౌల్ట్రీ రైతులకు దాణా ఖర్చు పెరిగి, గుడ్డు ఉత్పత్తి వ్యయం రూ.4.50కి చేరింది. త్వరలోనే కోడిగుడ్డు ధర రూ.20-25కి, కిలో చికెన్ రూ.400-500కి పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




