ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించింది. సీబీటీ ఆమోదం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 శాతం చొప్పున ఉద్యోగి వాటా గరిష్ఠంగా రూ.1,800 ఉండగా.. కొత్త పరిమితితో రూ.3,000కు పెరగనుంది. యజమాని వాటా కూడా పెరుగుతుంది. దీంతో చేతికి వచ్చే జీతం కొంత తగ్గినా.. పీఎఫ్‌లో అకౌంట్‌లోని పొదుపు పెరుగుతుంది. ఈ నిర్ణయంతో మరో 51 లక్షల మంది పీఎఫ్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.