దేశంలోని ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి ఇచ్చే డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని రూ. 8.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. ఈ నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ ఎక్స్‌గ్రేషియా ప్రతి ఏడాది 5 శాతం పెరుగుతుందని ఈపీఎఫ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.