తెలంగాణ ప్రభుత్వం 2026 జనవరి 9న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, వరి కోత యంత్రాలు (రైస్ రీపర్లు), కలుపు తీసే యంత్రాలు (వీడర్లు), విత్తనాలు చల్లే యంత్రాలు, రోటావేటర్లు వంటివి ఇవ్వనున్నారు. పలు యంత్రాలపై 40-50 శాతం సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ మొత్తం యంత్రం ధర, హార్స్ పవర్, రైతు వర్గం ఆధారంగా నిర్ణయమవుతుంది.