TG: వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త సమగ్ర వ్యవసాయ విధానం-2026 నివేదిక సూచించింది. పత్తి, పెసర, వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసే రైతులకు రైతు భరోసా సాయంతో పాటు ఎకరాకు రూ.8,000 అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని సూచించారు. జొన్న సాగుకు రూ.5,000, మొక్కజొన్న, కంది, మినుము, ఆముదం, సోయాబీన్, శనగ వంటి పంటలకు ఎకరాకు రూ.4,000 చొప్పున సాయం అందించాలని ప్రతిపాదించారు. జులై 2న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.