వ్యవసాయ యాంత్రీకరణకు రూ.147 కోట్లు కేటాయింపు

8524చూసినవారు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.147 కోట్లు కేటాయింపు
TG: రైతుల శ్రమ, సాగు ఖర్చులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యల చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద, రైతులు తమకు నచ్చిన కంపెనీ నుంచి యంత్ర పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50% వరకు, ఇతరులకు 40% వరకు సబ్సిడీ లభిస్తుంది. ఎంపిక కమిటీలో రైతు ప్రతినిధులకు చోటు కల్పించారు.

సంబంధిత పోస్ట్