భారత్‌కు విక్రయించిన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 శతఘ్నులకు సంబంధించిన సర్వీసులను అందించేందుకు
అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని
అమెరికా విదేశాంగశాఖ కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఈ డీల్ విలువ 482 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో భారత్ వద్ద ఉన్న కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు.