వాహనాదారులకు శుభవార్త. దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాదారులకు ఫాస్టాగ్ వార్షిక టోల్‌పాస్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా NHAI ఓ తీపికబురు అందించింది. ఈ వార్షిక టోల్‌పాస్‌ను మీకు నచ్చిన వాళ్లకి బహుమతిగా ఇవ్వొచ్చని పేర్కొంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమార్గ అనే యాప్ ద్వారా ఈ పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని తెలిపింది.