వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ వాహనాలకు నో టోల్ ఫీజు

14539చూసినవారు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ వాహనాలకు నో టోల్ ఫీజు
మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆగస్టు 22 నుంచి ముంబై అటల్ సేతుపై ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు టోల్ ఫీజు నుంచి మినహాయింపు పొందనున్నాయి. అదే విధంగా ముంబై-పూణే, సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలపై కూడా ఈ సౌకర్యం త్వరలో అమలులోకి రానుంది. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్