ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన వివాహ ఊరేగింపులో కాల్పులు జరపడంతో 20 ఏళ్ల అక్సా అనే యువతి మరణించింది. కింగ్ ప్యాలెస్‌కు వెళుతున్న వివాహ ఊరేగింపులో గుర్రపు స్వారీ చేస్తున్న స్నేహితులు కాల్పులు జరపారు. దీంతో పైకప్పుపై ఉన్న అక్సాకు తూటా తగిలింది. తూటా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్సా తండ్రి ఫిర్యాదు మేరకు, వరుడు సుహైల్, అతని సోదరుడు సాకిబ్, తండ్రి హాజీ షానవాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.