రైలు ప్రయాణికులకు శుభవార్త. కొత్తగా 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ‘ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మెమూ రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే, ఈ రైళ్లు ఏయే స్టేషన్లు/డివిజన్లలో అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు.