ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ప్రత్యేక రాయితీ ఛార్జీలు

26చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో ప్రత్యేక రాయితీ ఛార్జీలు
TG: ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచే లక్ష్యంతో.. తెలంగాణ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ (బీహెచ్‌ఈఎల్ డిపో) పరిధిలోని పలు దూరప్రాంత బస్సు సర్వీసులపై ప్రత్యేక రాయితీని ఆర్‌ఎం వి.శ్రీదేవి ప్రకటించారు. మైసూర్ ఏసీ స్లీపర్ రూ.1,800కు, బెంగళూరు ఏసీ స్లీపర్ రూ.1,200కు, విజయవాడ రాజధాని రూ.500కు, గుంటూరు సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.450కు తగ్గించబడ్డాయి. ప్రైవేట్ ఆపరేటర్ల పోటీని ఎదుర్కొనేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్