తిరుమలలో శ్రీవారి సేవకులకు గుడ్‌ న్యూస్

15993చూసినవారు
తిరుమలలో శ్రీవారి సేవకులకు గుడ్‌ న్యూస్
AP: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తిరుమలలో శ్రీవారి సేవకులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. సేవా కాలం పూర్తైన తర్వాత వారి విశేష సేవలను గుర్తించి, మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆస్థాన మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవకులతో సమావేశమైన ఆయన.. “శ్రీవారి సేవకులు నిజమైన భగవద్భాంధవులు. వారికి గౌరవం ఇవ్వడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను” అని అన్నారు.