పేదలకు శుభవార్త.. ఏపీలో 3D ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం!

7చూసినవారు
పేదలకు శుభవార్త.. ఏపీలో 3D ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద ఏపీలో తొలి విడతగా 3 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో కొన్ని ఇళ్లను అత్యాధునిక 3D టెక్నాలజీతో నిర్మించనున్నారు. ప్రత్యేక యంత్రాలతో గోడల నిర్మాణం, ఫ్లైయాష్ ఇటుకల వాడకం ఈ నిర్మాణంలో కీలకం. ఈ 3D ఇళ్లు బయటి ఉష్ణోగ్రత కంటే 5-8 డిగ్రీల వరకు చల్లగా ఉంటాయి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం 45-60 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 4న బుర్రిపాలెంలో ఈ 3D ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు.

సంబంధిత పోస్ట్