ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.40 వేల స్కాలర్‌ షిప్‌

0చూసినవారు
ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.40 వేల స్కాలర్‌ షిప్‌
దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల విద్యకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 'ట్రాన్స్‌జెండర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026–27'ను తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా 9వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న అర్హులైన ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు రూ. 40,000 వరకు ఏకమొత్తంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది. దరఖాస్తుదారులకు 10 లేదా 12వ తరగతిలో కనీసం 35% మార్కులు సాధించి ఉండాలి, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 10,00,000 మించకూడదు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 30.

సంబంధిత పోస్ట్