టీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. గంటకు 12 నిమిషాలే యాడ్స్

21చూసినవారు
టీవీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. గంటకు 12 నిమిషాలే యాడ్స్
టీవీ ప్రేక్షకులకు ఊరటనిచ్చేలా ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. టీవీ ఛానళ్లలో వాణిజ్య ప్రకటనల సమయాన్ని గంటకు గరిష్టంగా 12 నిమిషాలకే పరిమితం చేస్తూ ట్రాయ్ (TRAI) తీసుకొచ్చిన నిబంధనలను కోర్టు సమర్థించింది. జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, అమిత్ మహాజన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల స్వీయ ప్రచార కంటెంట్‌కే అనుమతి ఉంటుంది. ఈ నిబంధనలు తమ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతాయని పలువురు బ్రాడ్‌కాస్టర్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ, హైకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్