రైతులకు, మహిళలకు కేంద్రం శుభవార్త

12740చూసినవారు
రైతులకు, మహిళలకు కేంద్రం శుభవార్త
వికసిత్ భారత్–గ్యారెంటీ మిషన్ (వీబీ జీ రామ్ జీ) కింద గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా 375 రకాల పనులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, మహిళల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు, నూనె గానుగలు, షీ-మార్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడం, శాశ్వత గ్రామీణ ఆస్తుల కల్పన, మహిళా గ్రూపుల వ్యాపార అభివృద్ధి, రైతులకు మార్కెటింగ్ వసతులు కల్పించడం లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబడుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు(పాడి, గొర్రెలు, కోళ్ల పారాలు), జల సంరక్షణకు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీట వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్