2027–28 రబీ మార్కెటింగ్ సీజన్‌కు ఆరు ప్రధాన రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% నికర లాభం దక్కేలా ధరలను ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కుసుమకు అత్యధికంగా రూ.675 పెంచి క్వింటాల్‌కు రూ.7,215 చేసింది. ఆవాలకు రూ.413 పెంచి రూ.6,613, మసూర్ పప్పుకు రూ.390 పెంచి రూ.7,390, బార్లీకి రూ.136 పెంచి రూ.2,286, శనగకు రూ.83 పెంచి రూ.5,958, గోధుమకు రూ.25 పెంచి రూ.2,610గా నిర్ణయించింది.