TG: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.