రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులు!

10294చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు త్వరలోనే రైస్ మిల్లులు!
తెలంగాణలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే ఆధునిక రైస్ మిల్లులను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఖమ్మం(D) నేలకొండపల్లి(M) నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్