గుడ్‌న్యూస్.. 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను అందించనున్న ప్రభుత్వం

0చూసినవారు
గుడ్‌న్యూస్.. 40 శాతం సబ్సిడీతో డ్రోన్‌లను అందించనున్న ప్రభుత్వం
TG: వ్యవసాయ కూలీల కొరతను పరిష్కరించడానికి, రైతులకు ఖర్చులను తగ్గించడానికి రైతులకు డ్రోన్లు, సంబంధిత పరికరాలను రాయితీపై సరఫరా చేయడంతో పాటు, వాటి నిర్వహణలో శిక్షణ కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిట్‌కు గరిష్టంగా రూ. 4 లక్షలకు లోబడి, 40 శాతం సబ్సిడీని అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో రైతు సంఘాలు, సహకార సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. స్పెసిఫికేషన్‌లను బట్టి ఒక్కో డ్రోన్ ధర రూ. 9.5L నుండి రూ. 11.5L మధ్య ఉంటుంది. ఇందులో దాదాపు రూ.4లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్