TG: తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు గుడ్‌న్యూస్ అందించి. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి ఉన్న 'ఇద్దరు పిల్లల' నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు మార్గం సుగమం అవుతుంది.