గుడ్‌ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్

101చూసినవారు
గుడ్‌ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్
AP: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త వాట్సాప్ సదుపాయాన్ని ప్రారంభించింది. భక్తులు 9552300009 నంబర్‌ను సేవ్ చేసి “Hi” అని మెసేజ్ చేస్తే, చాట్‌బాట్ ద్వారా దర్శన టిక్కెట్లు, సేవా రిజర్వేషన్లు, వసతి, SSD టోకెన్లు, క్యూలైన్ లైవ్ స్టేటస్, శ్రీవాణి టికెట్లు, డిపాజిట్ రీఫండ్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. బుక్ చేసిన తర్వాత, వివరాలు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయవచ్చు. దీని ద్వారా భక్తులు సులభంగా, వేగంగా తిరుమల సమాచారాన్ని పొందవచ్చు.

సంబంధిత పోస్ట్